Thursday, April 25, 2024
- Advertisement -

సవాళ్లు ప్రతిసవాళ్లతో ఢీ అంటే ఢీ సై అంటే సై

- Advertisement -

తెలంగాణ నాయకుల్లో రేవంత్ రెడ్డి డీకే అరుణ ఇద్దరూ ఇద్దరే. తమ గొంతు బలంగా వినిపించగల సత్తా ఉన్న నాయకులే. వీళ్లిద్దరూ కాంగ్రెస్, టీడీపీలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసినవాళ్లు. కానీ కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయాక వీళ్లిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తడం లేదు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ కేసీఆర్ పనిపట్టే విషయంపై కత్తులు దూస్తున్నారు. స్వతహాగా కేసీఆర్ పెద్ద మాయలమరాఠి. మాటలగారడీలో ఆరితేరినవాడు. తిమ్మినిబమ్మి బమ్మిని తిమ్మి చేయగల సమర్ధుడు. ప్రత్యర్ధి ఎంత పెద్దనాయకుడైనా తనదైన ఎటకారం, తిట్లపురాణంతో తీసి పారేస్తుంటాడు. అటువంటి కేసీఆర్ తెలంగాణ ఎన్నికల సభల్లో డీకే అరుణను టార్గెట్ చేశారు. అరుణ బండారం ఎండగడతా. ఆమె వీడియోలు బయట పెడతా అంటూ వనపర్తి సభలో కేసీఆర్ విరుచుకుపడ్డారు.

దీనిపై డీకే అరుణ అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ఓటమి భయంతోనే కేసీర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అరుణ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సెంటిమెంట్ తో మళ్లీ జనాలను మోసం చేద్దానుకుంటున్నావా ? నీ ఆటలు ఇంక సాగవు ఖబడ్దార్ కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు. ఫస్ట్రేషన్ తో ఓటమి భయంతో కేసీఆర్ వణికిపోతున్నారని ఆయన మాటలను వింటేనే అర్ధమయిపోతోందని కేసీఆర్ శైలిలోనే డీకే అరుణ్ తిప్పికొట్టారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు కాదు కేసీఆర్…ఉద్యమ సమయంలో నువ్వు ఏం మాట్లాడిన చెల్లింది. ఇప్పుడిక నీ పాలనకు కాలం చెల్లింది అంటూ ఫైర్ అయిపోయారు. రఘువీరా రెడ్డి గారికి మంగళహారుతులు పట్టినా అని అన్నావ్‌.. దమ్ముంటే వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూపించు అంటూ సవాల్ విసిరారు. పూటకో పార్టీ మార్చిన నీవు. దుబాయ్‌ శేఖర్‌గా పేరుపొందిన నీవు,. నా గురించి మాట్లాడుతావా? నా బండారం బయటపెడ్తావా? అంటూ మండిపడ్డారు. ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చినా. ఒక్కో వేదికపై నీ చరిత్రను బట్టబయలు చేస్తాం. అంటూ అరుణ నిప్పులు చెరిగారు. పాలమూరుకు ఏం ఓరగబెట్టావో చెప్పు. 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చావా? చెప్పు అంటూ నిలదీశారు. ఇంకా జుటాకోర్‌ మాటలు మాట్లాడుతావా? 5 ఏళ్లు పాలమూరు ఏంపీ గా ఉండి ఏం చేసినవ్..జూరాలా, ఆర్డిఏస్,నెట్టెంపాడులకు ఓరగబెట్టింది ఏముంది..? నాలుగేళ్లుగా ఏం చేశినావ్‌? నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఓ శక్తి గురించి మాట్లాడుతున్నావ్‌. కేసీఆర్‌ ఖబర్దార్‌. అంటూ కేసీఆర్ శైలిలోనే తెలంగాణ యాస భాషలోనే దీటుగా కౌంటర్ ఇచ్చారు డీకే అరుణ.

మరోవైపు కక్షగట్టి తనపై ఐటీ దాడులు చేయించారని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పొత్త కోసం చంద్రబాబు కాంగ్రెస్ కు 5వందల కోట్లు ఇచ్చారంటున్న కేసీఆర్, నాడు తాను పొత్తుల కోసం ఎవరికి ఎంత ఇచ్చారో చెప్పాలని నిలదీసారు. తెలంగాణ ప్రజల మనోభావాలు రెచ్చగొట్టి కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు లాగా ఎన్నికలను మార్చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణలో ఓట్లు కూడా లేని చంద్రబాబు, లోకేశ్ ను ఎందుకు కేసీఆర్ విమర్శిస్తున్నారో చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూ తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. తన ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు చేయింటి ఏం సాధించారని ప్రశ్నించారు.

ఓటమి భంతో కేసీఆర్‌ తీరు కల్లు తాగిన కోతికి తేలు కుడితే ఎలా ఉంటుందో అలా ఉందని ఎద్దేవా చేశారు. మోడీ కాళ్లు పట్టుకుని కేసీఆర్ కుటుంబం మీద ఉన్న కేసులను కొట్టి వేయించుకున్నారని, మిగిలిన తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులను అలానే ఉంచి బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారని మండిపడ్డారు. మొత్తానికి తెలంగాణ ప్రతిపక్షనేతల్లో గట్టి వాయిస్ వినిపిస్తూ, కేసీఆర్ మాటకు మాట ధీటుగా సమాధానమిస్తూ కాక పెంచుతున్నారు డీకే అరుణ, రేవంత్ రెడ్డి. వీరి మాటలదాడితో టీఆర్ఎస్ నేతలు ఇరకాటంలో పడుతున్నారు. కేసీఆర్ సరైనవాళ్లు వీళ్లిద్దరే అని ఇతర నేతలూ అంగీకరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -