Wednesday, April 24, 2024
- Advertisement -

సంచలనం: మెగాస్టార్ సైరా కోసం రాజమౌళి

- Advertisement -

బాహుబలి లాంటి దేశం గర్వించే సినిమా తీసిన దర్శకుడాయన.. ఇక ఆ సినిమా స్ఫూర్తితోనే తన ‘సైరా’ మూవీని తీశాడు చిరంజీవి. అలాంటి దిగ్గజ దర్శకుడు రాజమౌళిని ఇప్పుడు సైరా మూవీ కోసం వాడుకుంటున్నారు చిరంజీవి.

హిందీ,తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతున్న సైరా కోసం రాజమౌళిని ఆశ్రయించారట.. దర్శక నిర్మాతలు రాంచరణ్, సురేందర్ రెడ్డి.

ప్రస్తుతం బల్గేరియాలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళికి సైరా మేకింగ్ విజువల్స్ చూపించి సైరాలోని లోటుపాట్లు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారట.. దర్శక ధీరుడు ఇప్పుడు సైరాను ఒక మంచి చిత్రంగా రూపొందించే పనిలో పడినట్టు సమాచారం..

ఆర్ఆర్ఆర్ హీరో రాంచరణ్ ప్రస్తుతం సైరా మూవీకి నిర్మాత. ఆ కోవలోనే రాజమౌళిని సాయం కోరారట.. రాజమౌళి సూచనల మేరకు సైరాను మేకోవర్ చేయడానికి చిత్రం బృందం రెడీ అయ్యిందట..

మరి దర్శకదీరుడు పర్యవేక్షణలో రూపొందుతున్న సైరా వెండితెరపై ఎలాంటి అద్భుతాలు ఆవిష్కరిస్తుందనేది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -