Sunday, April 28, 2024
- Advertisement -

జై సాయికుమార్ అంటోన్న లవర్ బాయ్

- Advertisement -

లవర్ బాయ్ తరుణ్ పెద్దోడైపోయాడు.తెలుగులో ఇక చేసింది చాలనుకుంటోన్న ఈయ‌న‌గారు… ఇపుడు తన దృష్టిని శాండిల్ ఉడ్ పై పెట్టాడు.

అందుకే కాబోలు తరున్ స్టెప్పులు ఈమధ్య బెంగుళూరుపై ఎక్కువగా పడుతున్నాయి.

 నిజానికి వన్సాప్ ఎ టైమ్  త‌రుణ్  అమ్మాయిల కలల రాకుమారుడు. ‘నువ్వే కావాలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరో అవతారమెత్తి.. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే లాంటి సూపర్ హిట్లతో అద‌ర‌గొట్టేశాడు. అప్పట్లో ప్రొడ్యూస‌ర్లు ఈ కుర్రహీరో కోసం క్యూ లైన్ క‌ట్టేవారు. అయితే ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు రావ‌డంతో మ‌న హీరోగారు బాగా వెనుకబడిపోయారు. గత పదేళ్లలలో అతడికి ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు. అందుకే ఇక చేసేదేమి లేక జై సాయికుమార్ అంటూ క‌న్నడ‌లోకి దూకేసాడు. అక్కడ  ఒన్దు లవ్ స్టోరీ అనే చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక తరుణ్ తెలుగులో ఆఫర్లను రాబట్టుకోలేకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అతని తర్వాత వచ్చిన కుర్రహీరోలైన వరుణ్ సందేష్ ,అఖిల్ ,నానీలు తరుణ్ అవకాశాలను ఎత్తుకెళ్లిపోయారు. ఇక హీరోల కుమారులుగా వచ్చిన నాగచైతన్య లాంటివారు లవ్ స్టోరీస్ ను హ్యాండిల్ చేయడం   మొదలు పెట్టారు. దీంతో తరుణ్ కు అసలుకే ఎసరొచ్చింది. అందుకే ఇక త‌ప్పద‌ని డిసైడై బెంగుళూరు బ‌స్ ఎక్కాడు. సారీ ఎయిర్ బ‌స్ ఎక్కాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -