Thursday, May 9, 2024
- Advertisement -

త్రివిక్రమ్ ‘శీను’ అయిపోయిందంటారా…?

- Advertisement -

మాటల మాంత్రికుడి దగ్గర మాంచి మ్యాటర్ ఉందనే విషయం తెలియంది కాదు.అయితే అతనిలో ఆ పస… గత కొన్ని చిత్రాల నుంచి తగ్గిపోయినట్లుగా అతని సినిమాలు చూస్తుంటే మనకు అర్ధమౌతుందో. 

మాటల మాంత్రికుడు….ఎంత స్పీడ్ గా ఎదిగాడో…. అంతే స్పీడ్ గా పడిపోతోన్నాడు. త్రివిక్రమ్ శీను అయిపోయిందంటూ ఇప్పటికే మార్కెట్లో రకరకాల  వార్తలు గుప్పు మంటున్నాయి.

గతంలో  ఈయనగారు ఏం రాస్తే అదే డైలాగ్ . ఎలాంటి పంచ్ ఇచ్చినా….దానికి పంచ్ ఇచ్చే సత్తా గల మరో దర్శకుడు లేడు.దీంతో స్టార్ రైటర్ గా ఎదిగి సౌత్ లోనే అత్యంత కాస్ట్ లీ రైటర్ గా మారిపోయాడు.దాన్ని అక్కడితో సరిపెడితే బాగోదని… ఇంకో మెట్టు పైకెక్కి దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యాడు.ఇండస్ట్రీ హిట్ ను కూడా తీశాడు.కాని ఇపుడు త్రివిక్రమ్ సీను తగ్గినట్లు కనిపిస్తుంది.గత కొంతకాలంగా త్రివిక్రమ్ సినిమాలు కథా బలం లేక బక్క చిక్కిపోయినట్లవుతున్నాయి.దీంతో హీరోలు మనవాడిని సైడ్ చేసేసారు.

త్రివిక్రమ్ ఇపుడు నితిన్ తో ఏదో వాంటెడ్లీ సినిమా చేస్తున్నాడంటే….. పొరభాటే.అతనికి మరోటాప్ హీరో డేట్స్ దొరక్కే…. ఇలా సినిమా చేయాల్సి వస్తోంది. అయితే నితిన్ తర్వాత మనవాడితో చేసే ఆ హీరో ఎవ్వరో… సారువాడికి అస్సలు తెలియదు. మెగా కాంపౌండ్ పిలిచి మరీ….బొట్టుపెడుతుందనే నమ్మకం కూడా లేదు. కమిట్ మెంట్ ఉందని పవన్ రానున్న రోజుల్లో అవకాశం ఇవ్వొచ్చు. లేదంటే అంతే. సో త్రివిక్రమ్ ముందున్న రోజులన్నీ ఏమాత్రం బాగాలేదు.అతనిలో విషయం నిజంగా ఉందనే అతను ఫీలైతే మాత్రం… చేసిన వారితో కాకుండా కొత్తవారితో ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది.ఆ విషయంలో మాటల మాంత్రిక మాస్టార్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో ఎవ్వరికీ తెలియదు.

త్రివిక్రమ్ ఈ ఏడాది కచ్చితంగా మహేష్ తో సినిమా చేయెచ్చు.ఆల్రెడీ ఇదే మాటను ‘మేము సైతం’ టైమ్లో  ఇద్దరు కలిసి చెప్పారు..అయితే సన్నాఫ్ సత్యమూర్తితో త్రివిక్రమ్ చేసిన సినిమాలో కథ ఎంతుందనేది జనాలకు బాగా అర్థమైంది.ఎట్ ది సేమ్ టైమ్ ప్రిన్స్ కు సైతం ఇదే విషయం బుర్రకెక్కింది.దీంతో మహేష్ కూడా కథ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని డిసైడ్ అయ్యాడు.అందుకే త్రివిక్రమ్ చెప్పిన రెండు కథలకు నో చెప్పాడట. ఇంకా చెప్పే ఓపిక లేక…. నితిన్ కు వాటిలో  ఓ కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేసుకున్నాడు.మరి ఇది వర్కవుట్ అయితే ఓకే .లేదంటే త్రివిక్రమ్ శీను అయిపోయిందనే మాట నిజమౌతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -