Friday, May 10, 2024
- Advertisement -

తమన్నా..సమంత.. ఇంతకీ వెంకీ కూతురు ఎవరు..?!

- Advertisement -

ఆ మధ్య ‘పికు’ సినిమా విడుదల అయినప్పుడే ఆ సినిమా తెలుగు రీమేక్ పట్ల విక్టరీ వెంకటేష్ ఉత్సాహం చూపిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ , దీపిక పదుకొనేలు తండ్రీ కూతుళ్లుగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంకీ ఆ సినిమాను తెలుగులో రూపొందించాలని ఆసక్తితో ఉన్నట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఎందుకో కానీ ఆ ప్రతిపాదన ఇప్పటి వరకూ ముందుకు వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది.

ఆ సినిమా రీమేక్ పట్ల చాలా ఉత్సాహంతో ఉందట దగ్గుబాటి ఫ్యామిలీ. హిందీలో అమితాబ్ చేసిన పాత్రపై వెంకీ చాలా ప్రేమను పెంచుకొన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆ సినిమా రీమేక్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఆ సినిమా హక్కులను కొనే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. మరి ఇప్పుడు మళ్లీ వెంకీ కూతురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ లో దీపికాపదుకొనే ఈ పాత్రను తెలుగులో తమన్నా, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ దీపికనే తెలుగు వెర్షన్ లో నటింపజేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. మరి అంతిమంగా వెంకీ కూతురుగా ఎవరు కన్ఫర్మ్ అవుతారో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -