Friday, May 10, 2024
- Advertisement -

నయనతారతో పోటీ పడుతున్న నితిన్..!

- Advertisement -

ఈ నెల పదిహేడో తేదీన ముందుకు రానుంది ‘కొరియర్ బాయర్ కల్యాణ్’. నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఏడాదిన్నర కిందటే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ..

వరస వాయిదాలతో ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. గౌతమ్ మీనన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. పేరకు పెద్ద దర్శకుడే అయినా.. నిర్మాతగా మాత్రం ఈ సినిమాను విడుదల చేయడానికి ఆయన చాలా కష్టాలే పడినట్టుగా ఉన్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించిన ఆయన ముందుగా తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తున్నాడు. 

మరి ఈ సినిమా వాయిదాలతో కొంత వరకూ ప్రేక్షకుల ఆసక్తిని కోల్పోయింది. ఇదే సమయంలో ఈ సినిమాకు ఒక ధీటైన పోటీదారు కూడా కనిపిస్తోంది. అదే మయూరి సినిమా! నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ఆ హారర్ సినిమా కొరియర్ బాయ్్ తో పాటే విడుదల కానుంది! దీంతో… ఈ రెండు సినిమాల మధ్యనా పోటీ ఏర్పడుతోంది. తమిళం నుంచి వచ్చే డబ్బింగ్ హారర్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్టే ఉంది. అందులోనూ ఆ సినిమాలో నయనతార ముఖ్యపాత్రలో నటించింది. దీంతో ఆ సినిమా నితిన్ సినిమాకు కొంత పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. మరి మయూరి ప్రభావం.. లేటుగా డెలివర్ అవుతున్న కొరియర్ బాయ్ పై ఎంత వరకూ ఉంటుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -