- Advertisement -
ప్రియా ప్రకాశ్ వారియర్.. సోషల్‌మీడియాలో ఆమె ఓ సెన్సేషన్. ఆమె ఇలా కన్ను కొడితే.. అలా అందరూ పడిపోయారు. ఎవరు ఊహించిని రీతిలో పాపులర్ అయింది.ఈమె షాపింగ్ చేసిన సంచటలమే అన్నంతగా మారింది ప్రియ క్రేజ్.ప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రియ అవుట్ లుక్ సోషల్ మీడియా అవార్డు అందుకున్నారు.
ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నా తొలి అవార్డును అందుకోవడం గౌరవంగా ఉంది. ‘వైరల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కోసం నన్ను ఎంచుకున్నందుకు ‘అవుట్ లుక్’ సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన చిత్రం ‘ఒరు అదార్ లవ్’. ఇందులోని ‘మాణిక్య మలరయ’ అనే పాటలో ప్రియ పలికించిన హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.