Thursday, May 2, 2024
- Advertisement -

వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్.. ప్రేమలో మునిగిపోయాడు..!

- Advertisement -

వరల్డ్ ఫేమస్ లవర్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ మరో సారి అర్జున్ రెడ్డి తరహా పాత్రలో కనిపిస్తున్నట్లు అర్దం అవుతుంది. ప్రేమంటే ఒక కాంప్రమైజ్‌కు అర్థం.. ప్రేమంటే సాక్రిఫైజ్.. ప్రేమంటే దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావంటూ టీజర్ మొదలైంది. రాశీ ఖన్నాతో లిప్ లాక్ సీన్స్ కూడా చేసాడు విజయ్ దేవరకొండ.

కేథరిన్, ఎజిబెల్లా, ఐశ్వర్యా రాజేష్‌తో వచ్చే సన్నివేశాలు కూడా ఉన్నాయి. 1 నిమిషం 14 సెకన్స్ టీజర్‌లో చాలా కవర్ చేసాడు దర్శకుడు. డియర్ కామ్రేడ్ ప్లాప్ తర్వాత ఎలాగైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్. ఇందులో విజయ్ కారెక్టర్ ప్లే బాయ్ గా కనిపిస్తోంది.

క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మిస్తున్నారు. 2020 ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. టీజర్ ఎలా ఉందో మీరు చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -