Tuesday, May 7, 2024
- Advertisement -

యాష్ రాజ్ ఫిలింస్ సంస్థలో భారీ మార్పులు

- Advertisement -

యాష్ రాజ్ ఫిలింస్. బాలీవుడ్‌లో 1970’s నుంచి ఇరగదీస్తోన్న సంస్థ. అమితాబ్, ధర్మేంద్ర, షారుక్, అమీర్ ఖాన్ లతో పాటు పలువురు హీరోలతో భారీ చిత్రాలు తీసి తన స్థాయి ఏంటో నిరూపించుకుంది.

సిల్ సిల్లా ,కబీ కబీ, దిల్ వాలే దుల్ హనియా లేజాయేంగే లాంటి చిత్రాలను ఈ బ్యానరే రూపొందించింది. ఇపుడీ సంస్థ గత కొంతకాలంగా చిన్న చిత్రాలు చేస్తూ…. దెబ్బ మీద దెబ్బ తగిలించుకుంటూ కూర్చుంది. అందుకే బ్యానర్ ఇమేజ్ బ్యాడ్ కాకూడదని లేటెస్ట్ గా ఓ డెసిషన్ తీసుకుంది. ఇక నుంచి తమ ఇమేజ్ తగ్గించే చిన్న చిత్రాలను నిర్మించకూడదని. చిన్న చిత్రాలు చేయడం వలన తమ అంచనాలు తలకిందులై ఫ్లాప్ లు మూటగట్టుకోవల్సి వస్తోందట. దీంతో 45 ఏళ్ల చరిత్ర గల యాష్ రాజ్ ఫిలింస్ మసకబారుతుందని వారు భయపడుతున్నారు. అందుకే యాష్ రాజ్ ఫ్యామిలీ సమిష్టిగా ఇక నుంచి తమ బ్యానర్ ప్రెస్టీజ్ పెంచే భారీతనంతో భారీచిత్రాలనే రూపొందిస్తామని ప్రకటించింది.

 ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక షారుక్ కూడా ఉన్నాడని బిటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -