కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు తలనొప్పిగా మారింది సుమలత వ్యవహారం. ఒకప్పటి స్టార్ హీరోయిన్ వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె భర్త హీరో అంబరీష్ కొద్ది రోజులు క్రితమే మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.దీంతో సుమలతకు ఆ పార్టీ టికెట్ ఇస్తుందని అందరు భావించారు. కాని సుమలతకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది.ఆమె టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా కన్నడ స్టార్ హీరో యాష్ మద్దతుగా నిలిచారు.
KGF సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపదించుకున్నాడు యష్. సుమలతకు యష్ మద్దతుగా నిలవడంతో అధికార పార్టీల్లో తీవ్ర అలజడి నెలకొంది. ఎందుకంటే కన్నడలో యష్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.పైగా అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి కొడుకు నిఖిల్ గౌడ్ పోటీలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. యాష్ తో పాటు దర్శన్ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తో పాటు ఇతర సినీ ప్రముఖులు సుమలతకు మద్దతు పలుకుతున్నారు. మరి అధికార పార్టీని తట్టకుని ఆమె ఎలా గెలుస్తారో చూడాలి.
- Advertisement -
‘KGF’ హీరో స్టార్‌డమ్ సుమలతకు పనికొస్తుందా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -