పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ , కమెడియన్ అలీ మంచి స్నేహితులు అన్నది ఇండస్ట్రీ మొత్తం తెలిసిందే. పవన్ సినిమా అంటే చాలు అలీకి ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్‌ను క్రియేట్ చేస్తారు దర్శకులు. ‘అలీ అంటే నాకెంతో ఇష్టం.. తను లేకుండా నేను సినిమా చేయలేను’ అని పవన్ కూడా ఓ సందర్భంలో చెప్పాడు. ‘మా స్నేహం చాలా గొప్పది..’ అంటూ పవన్ గురించి చాలాసార్లు కితాబులు ఇచ్చాడు అలీ. అలాంటి అలీని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అలీని టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. పవన్ సినిమాలు మానేసి జనసేన పార్టీ పెట్టి రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అలీ పవన్ పెట్టిన జనసేన పార్టీలో చేరతాడని అందరు భావించారు. తన పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు స్పందించలేదు అలీ.
తాజాగా అలీ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడైన వైఎస్ జగన్ను కలవడం సంచలనంగా మారింది. అది అనుకోకుండా జరిగిందో , మరి ఎలా జరిగిందో తెలియదు కాని జగన్‌తో అలీ కలిసి కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. దీంతో అలీ వైసీపీలో చేరతారనే వార్తలు ఊపుందుకున్నాయి. ఇలా అలీపై వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ అతనిపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.‘పవన్ పక్కనే ఉంటూ.. ఇంత పనిచేస్తావా’ అన్నట్టు అలీని ఆడిపోసుకుంటున్నారు. కొందరు అయితే అలీని మతంతో కూడా దూషించడం కనిపించింది. ఏది ఏమైనప్పటికి జగన్‌ను అలీ కలవడంపై పవన్ ఫ్యాన్స్ అతనిపై కాస్తా గుర్రుగానే ఉన్నారు.
- దిగొచ్చిన దీదీ..కూటమి సమావేశానికి!
- విజయ్ స్థానంలో లారెన్స్..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
- వైసీపీ నేతలే టార్గెట్‌గా అక్రమకేసులు!
- కేంద్ర మంత్రుల శాఖల మార్పులు..నిర్మలమ్మకు కొత్త బాధ్యతలు?
- కర్ణాటక మంత్రుల అలకలు..రాజీనామాలు.. డీకేకి అసలు పరీక్ష…!
- ఇకపై గోవా వెళ్లకండి..ఏపీలోనే అంతా!
