Sunday, May 4, 2025
- Advertisement -

‘యాత్ర’ మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్‌

- Advertisement -

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణించి 10 సంవ‌త్స‌రాలు కావస్తోన్న ఆయ‌న ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాల ద్వారా ఆయ‌న ఇప్ప‌టికి ప్ర‌జ‌ల గుండెల్లో బ్ర‌తికే ఉన్నారని చాలామంది నమ్ముతుంటారు. ఇక ఆయ‌న రాజ‌కీయ జీవితంలోని ప్ర‌ముఖ ఘ‌ట్ట‌మైన పాద‌యాత్ర ఆధారంగా సినిమాను తెర‌కెక్కించారు. ఈ పాద‌యాత్రే ఆయ‌న‌ను సీఎం చేసింద‌ని అంటుంటారు రాజకీయ విశ్లేష‌కులు. యాత్ర అనే పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాలో వైఎస్ఆర్‌గా మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ మమ్మూట్టి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నిన్న‌నే(శుక్ర‌వారం) విడుద‌లైంది. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. యాత్ర సినిమా వైఎస్ అభిమానుల‌తో పాటు , సామాన్య ప్రేక్ష‌కుల‌ను సైతం ఆక‌ట్టుకుంది.మమ్ముట్టి ఆ పాత్రలో ఒదిగిపోయారని, దర్శకుడు చెప్పాలనుకున్న విషయాలను సూటిగా చెప్పాడని అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 970 థియేటర్లలో విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. ఇక ఈ సినిమా క‌లెక్ష‌న్లు కూడా పాజిటివ్‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యూఎస్ ప్రీమియర్ షోలతో ఈ సినిమా 71,289 డాలర్లను వసూలు చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. పాజిటివ్ టాక్ రావ‌డంతో సినిమాకు క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఇక ఈ సినిమా మొద‌టి వీకెండ్‌ను కూడా ఫేస్ చేయ‌బోతుంది కాబ‌ట్టి సినిమా భారీ వ‌సూళ్లు సాధించే అవ‌కాశం ఉంద‌ని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -