Thursday, April 18, 2024
- Advertisement -

ఊర మాస్ లుక్‌లో అక్కినేని అఖిల్

- Advertisement -

యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెర కెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్’ యూనిట్ సరికొత్త పోస్టర్ తో విడుదల చేసింది. ఈ సినిమా లో అఖిల్ పూర్తి భిన్నంగా కనిపించబోతున్నాడు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కండలు తిరిగిన శరీరంతో స్టయిలీష్ గా సిగరెట్ తాగుతూ ‘ఏజెంట్’ యాటిట్యూడ్ తో కనిపించడం అభిమానులు ఆకట్టుకుంది. ‘ఏజెంట్’ పాత్ర కోసం అఖిల్ ఎంతలా మేకోవ‌ర్ అయ్యారో చెప్పడానికి ఈ పోస్టర్ నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ‘ఏజెంట్ ‘చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

ట్రిపుల్ ఆర్‌ను మించిన బడ్జెట్‌తో మహేశ్ మూవీ

భారీగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన కృతి శెట్టి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -