Saturday, April 20, 2024
- Advertisement -

బాబు డైరెక్షన్‌లో ‘ఎన్టీఆర్’…..వైఎస్‌ని విలన్‌గా చూపించారా?

- Advertisement -

వెన్నుపోటు ఎపిసోడ్‌ తర్వాత బాబుని మించిన రాక్షసుడు చరిత్రలోనే లేడని స్వయంగా ఎన్టీఆర్ అన్న మాటలు ఎన్టీఆర్ బయోపిక్‌లో లేవుగానీ వైఎస్సార్‌ని విలన్‌గా చూపిస్తూ మాత్రం కథను అల్లారట. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి లీక్ అయిన ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ టూ మహానాయకుడులో చంద్రబాబునేమో పెజా సేవ అంటే కసి ఉన్న నాయకుడిగా చూపిస్తూ వైఎస్సార్‌ని మాత్రం ఫ్యాక్షన్ లీడర్‌గా ప్రజెంట్ చేసేలా ఒక సీన్ ఉందని చెప్తున్నారు. అది కూడా ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా వైఎస్సార్ మాట్లాడినట్టుగా కథలు అల్లి చూపబోతున్నారు. అదే టైంలో ఎన్టీఆర్ అత్యంత ప్రేమించే వ్యక్తిగా, ఆరాధించే యువ నాయకుడిగా చంద్రబాబు భజన కీర్తనలు ఒక రేంజ్‌లో వినిపించబోతున్నారు. ఎడిటింగ్ టేబుల్‌పైన ఆయా పొలిటికల్ సీన్స్ చూసిన వాళ్ళు పగలబడి నవ్వుకోవడమే కాకుండా అందరికీ ఈ విషయాన్ని చెప్తూ చంద్రబాబును ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

క్రిష్, బాలయ్య, రానాలు ఫైనల్ స్క్రిప్ట్ బాబుకు చూపించి బాబు ఆశీర్వాదం తీసుకున్నప్పుడే ఎన్టీఆర్ పొలిటికల్ బయోపిక్‌లో చంద్రబాబుని హీరోని చేసి ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఇంకాస్త డ్యామేజ్ చేస్తారన్న విషయం అందరూ ఊహించిందే. అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు ఓ రేంజ్‌లో దడ అని చెప్పిన పవన్ కళ్యాణ్ మాటలను నిజం చేస్తూ ఇప్పుడు బయోపిక్‌లో కూడా వైఎస్‌ని కలవరించడం మాత్రం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. వైఎస్‌లు అంటే చంద్రబాబుకు ఏ స్థాయిలో భయం ఉంది అన్న విషయం మళ్ళీ మళ్ళీ తెలుగు ప్రజలకు అర్థమవుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -