Tuesday, May 14, 2024
- Advertisement -

అల్లు అర్జున్ డాన్స్ కు ఫిదా అయ‌న హాట్ బ్యూటీ జ‌రీన్ ఖాన్‌

- Advertisement -

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో అందరికీ సుపరిచితురాలయిన జరీన్ ఖాన్ త్వరలో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టనుంది. గోపీచంద్ సరసన చాణక్య అనే సినిమా లో గోపీచంద్ ప్రధాన పాత్ర పోషించనుంది. జరీన్ ఖాన్ ఈ సినిమా విడుదల కోసం చాలా ఉత్సాహం గా వెయిట్ చేస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవలే ఈ సినిమా గురించి, తన టాలీవుడ్ అరంగేట్రం గురించి జరీన్ ఖాన్ మీడియా తో మాట్లాడింది.

తన సినిమా గురించి, తన పాత్ర గురించి గొప్పగా చెప్పిన జరీన్ ని మీడియా వాళ్ళు తనకి తెలుగు సినిమా పరిశ్రమ లో ఇష్టమైన డాన్సర్ ఎవరు అని ప్రశ్నించగా తడుముకోకుండా అల్లు అర్జున్ అని సమాధానం ఇచ్చింది. “తెలుగు లో చాలా మంది డాన్సర్లు ఉన్నారు. అందరూ మంచిగా డాన్స్ చేస్తారు కానీ నాకు మాత్రం అల్లు అర్జున్ డాన్స్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన డాన్స్ చేస్తుంటే చాలా అలవోకగా కనిపిస్తుంది.” అని జరీన్ చెప్పింది.

ఇంతకు ముందు ప్రియా వారియర్ కూడా తనకి అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇష్టం అని బన్నీ మీద కాంప్లిమెంట్స్ కురిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -