Wednesday, May 15, 2024
- Advertisement -

వైవి సుబ్బారెడ్డికి బిగ్ షాక్….టీటీడీ ఛైర్మెన్ గా కొత్త వ్య‌క్తి …

- Advertisement -

న‌వ్యాంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అన్ని నామినేటేడ్ పోస్ట్‌ల‌ను ర‌ద్దు చేసింది. ఇవాల జ‌రిగిన మొద‌టి కేబినేట్‌లో దీనిపై జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌ధానంగా టీటీడీ చైర్మెన్ ప‌ద‌వపైనె అంద‌రి చూపులు ఉన్నాయి. ఇప్ప‌టికే అనేక మంది పేర్లు తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వారిలో ప్ర‌ధానంగా మాజీ ఎంపీ వైవిసుబ్బారెడ్డి పేరు ఛైర్మెన్ రేసులో వినిపిస్తోంది. ఛైర్మెన్‌గా వైవిని నియ‌మించార‌నె వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైవికి ఎంపీ సీటు ఇవ్వ‌కుపోవ‌డంతో ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముఖ్య‌మైన ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ హామి ఇవ్వ‌డంతో మెత్త బ‌డ్డారు. ఛైర్మెన్‌గా ఆయ‌న పేరు తెర‌పైకి వ‌చ్చిన వెంట‌నే టీడీపీ విమ‌ర్శ‌ల దాడిని పెంచింది. క్రిష్టియ‌న్ అయిన వైవికి టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వి ఎలా ఇస్తారంటూ విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. నేను హిందువ‌ని వైవి క్లారిటీ ఇచ్చినా విమ‌ర్శ‌లు ఆగడంలేదు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న స్థానంలో కొత్త పేరు తెర‌పైకి వ‌చ్చింది.

అయ‌న ఎవ‌రో కాదు ఆకేపాటి అమ‌ర‌నాథ్ రెడ్డి . ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో రాజంపేట టీడీపీ నుంచి మేడా మ‌ళ్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేర‌డంతో రాజంపేట టికెట్‌ను జ‌గ‌న్ కేటాయించారు. దీంతో అమ‌ర‌నాథ్ రెడ్డి అల‌గ‌డంతో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌విని ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో మేడా గెలుపున‌కు కృషిచేశారు. వైవిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో ఛైర్మెన్‌గా అమ‌ర‌నాథ్ రెడ్డి నియామ‌కం పూర్తి అయ్యింద‌ని అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌డే త‌రువాయ‌ని పార్టీ వ‌ర్గాల‌నుంచి విశ్వ‌నీయ స‌మాచారం.

టీటీడీ ఛైర్మెన్ రేసులో సీనియ‌ర్ నేత తిరుప‌తి ఎమ్మెల్యే క‌రుణాక‌ర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కేబినేట్‌లో స్థానం ద‌క్క‌క పోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని రాజ‌కీల‌నుంచి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించి సంల‌చ‌నం రేపారు. క‌నీసం టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌విపూనె ఆశ‌లు పెట్టుకున్నారు. కాని జ‌గ‌న్ మాత్రం అమ‌ర‌నాథ్ రెడ్డి వైపే మొగ్గుచూపిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనె అయ‌న పేరును అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -