- Advertisement -

కొత్త ప‌రిజ్ఞానంతో న‌టీన‌టుల ఎంపిక‌

- Advertisement -

ఎన్టీఆర్ సినిమా కోసం తేజ తంటాలు

న‌ట సార్వ‌భౌముడు, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రెండు మార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర‌పై ఓ సినిమా వ‌స్తోంది. తెలుగు వాడి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీ వర‌కు చాటిన గొప్ప వ్య‌క్తి ఎన్టీఆర్‌. ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో ఆ రాముడిలా ఈ రాముడి పాల‌న జ‌రిగింది. వాటితో పాటు ఎన్నో వివాదాలు, ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఇప్ప‌టికీ అత‌డి జీవితం ఓ మిస్ట‌రీగా మిగిలింది. ఈ నేప‌థ్యంలో అత‌డి జీవిత చ‌రిత్ర‌ప ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవ‌ల ప్రారంభ‌మైంది.

అయితే సీనియ‌ర్ ఎన్టీఆర్ మొద‌టి భార్య బ‌స‌వ‌తార‌కం. బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టించే వారికోసం చిత్ర‌బృందం తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతోందంట‌. ఆమె పాత్ర కోసం ఆడిష‌న్స్ కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించారు. అయితే కుప్పలుతెప్ప‌లుగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయంట‌. అన్ని ఫొటోల‌ను ఎక్క‌డా ఎంపిక చేయాల‌ని త‌ల‌నొప్పిగా మారిందంట‌. అయితే ఈ ఎంపిక కోసం కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగిస్తున్నార‌ట‌.

ఫేస్ రిక‌గ‌నేష‌న్ అనే సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించబోతున్నారంట‌. ఈ సాఫ్ట్‌వేర్ ముఖం ఆకృతి.. కొలతలు.. కవళికలు అన్నీ గుర్తించి ఎవరి ఫొటో అయితే బవసతారకం ముఖానికి సరిపోలుతుందో ఆ సాఫ్ట్‌వేర్ నిర్ణ‌యిస్తుందంట‌. ఆ సాఫ్ట్‌వేర్ ఎంపిక చేసినవాళ్లనే ఆడిషన్‌కు పిలిస్తే స‌గం భారం త‌గ్గిపోతుందని భావిస్తున్నారు. టెక్నాలజీతో స‌గం ప‌ని పూర్త‌యి సినిమా వేగ‌వంతం అయ్యే అవ‌కాశం ఉంది. జ‌న‌వ‌రి 18వ తేదీ ఎన్టీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా టైటిల్ లేదా టీజ‌ర్ విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం ప్లాన్ వేస్తోంది. అందుకే వేగంగా ఈ ప‌నులు చేప‌డుతోంది. బ‌స‌వ‌తార‌కం, ఎన్టీఆర్‌ సీతారాముళ్ల క‌నిపిస్తారు. ఆ త‌ర్వాత బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ మ‌ర‌ణించ‌డంతో రెండో పెళ్లి ఆరు ప‌దుల వ‌య‌సులో ల‌క్ష్మీపార్వ‌తీని చేసుకున్నారు. దీంతో రాజ‌కీయాల్లో వివాదం రాజుకుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -