Friday, May 10, 2024
- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌తీరాల‌కు జ‌గ‌న్ చేరుస్తారా….?

- Advertisement -

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అధికార‌పార్టీ టీడీపీ ముందు వైసీపీ నెగ్గుకు రావ‌డం క‌ష్ట‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. టీడీపీకి స‌పోర్ట్‌గా ప‌వ‌న్ ఉన్నాడు. మామూలుగా అదికారం లో లేకుండ పార్టి ని మ్యానేజ్ చెయ్యడం అంత ఈజి కాదు . నిజానికి అలా పార్టీనీ న‌డ‌పాలంటే ఎంతో ప‌ట్టుద‌ల ఉండాలి.

అధికార పార్టీ ఎన్నికుట్ర‌లు చేస్తున్నా వైసీపీలో జోరు మాత్రం త‌గ్గ‌డంలేదు. నాయ‌కులు పార్టీని వీడి వెల్తున్నా ఉన్న నాయ‌కుల్లో ఏమాత్రం జోష్ త‌గ్గ‌డంలేదు. దీనికి కార‌నం వైసీపీ అధినేత జ‌గ‌న్ అన‌డంలో సందేహంలేదు. పార్టీకి ద‌శ‌,దిశా అన్నీ జ‌గ‌నే. అడుగడున ప్రతిపక్షాల వూబిని తట్టుకుని రావడం అంత సుల‌భం కాదు.

ఇలాంటి ప‌రిణామాలు ఏ పార్టీకైన ఎదురైతే మ‌రో ప్ర‌జారాజ్యంలా మాదిరిగా వైసీపీ కూడా విలీనం అయ్యేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్న నంద్యాల ఉప ఎన్నిక జ‌గ‌న్‌కు గుణ‌పాఠం నేర్పాయి. అబ‌ద్ధాల‌తో పాల‌న సాగిస్తున్న చంద్ర‌బాబుకు నీతికి నిజాయితీకి క‌ట్టుబ‌డ్డ వైసీపీకి మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంగా ఆయ‌న ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌.

2019 లో అధికారంలోకి వ‌చ్చేందుకు చివ‌రిఅస్త్రంగా ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. చంద్ర‌బాబు పాల‌న‌లోని డొల్ల‌త‌నాన్ని ఎండ‌గ‌ట్టారు. ఇక‌, మిగిలిన ఎమ్మెల్యేలు, నేత‌ల‌ను కాపాడుకుంటూనే రాజ‌కీయంగా తాను చేయాల్సిన ప‌ని తాను చేస్తున్నారు. ఎన్ని అప‌జ‌యాలు ఎదుర‌వుతున్నా మిగిలిని వారు కూడా జ‌గ‌న్‌నే అనుస‌రిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలు జగన్ కి ఏ మాత్రం విజయసికరాలకు తిసుకెల్తాయో చూడాలి .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -