- Advertisement -
మహారాష్ట్రలో ఘోర పోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ తప్పిదం కారనంగా 32 మంది ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. దపోలీలోని డా.బాలాసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ కు చెందిన 40 మంది సిబ్బంది ఈ రోజు విహారయాత్రలో భాగంగా మహాబలిపురానికి బయలుదేరారు. వీరు వెల్తున్న బస్సు అదుపు తప్పి 500 మీటర్ల లోతు ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా మొత్తం 40 మంది యాత్రికులు ఉన్నారు.
ప్రమాద సమయంలో బస్సులో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ప్రమాద ప్రదేశానికి పోలీసులు వెళ్లినట్లు తెలిసింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 32 మృతదేహాలను బయటకు వెలికి తీశారు. ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.