రోజురోజుకు మనం పురోగమనంలోకి పోతున్నట్లు లేదు. తిరోగమనంలోకి పోతున్నట్లు ఉంది. అవును ప్రపంచం కంప్యూటర్ యుగంలో దూసుకుపోతుంటే కొంత మంది నేటికీ అందకారంలో మగ్గిపోతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె దారుణం మరువక ముందే తెలంగాణలోని పెద్దపల్లిలో ఇదే మాదిరిగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనలో క్షుద్రపూజల పేరుతో మోసం చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి పోతే.. మహారాష్ట్రకు చెందిన క్షుద్రపూజల ముఠా పెద్దపల్లి జిల్లాలో తిరుగుతూ ప్రజలను మోసం చేస్తోంది. మహిళలతో బారిష్ పూజ చేస్తే డబ్బుల వర్షం కురుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ.. అమాయకులను బురిడీ కొట్టిస్తోంది.
ఈ క్రమంలో ఆ ముఠా కొందరికి డబ్బు, బంగారం ఆశ చూపింది. క్షుద్రపూజల కోసం ఒక యువతిని కొనుగోలు చేసేందుకు ఆ ముఠా ప్రయత్నం చేసింది. ఈ విషయాలను తెలుసుకున్న పోలీసులు ఆ ముఠాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి మాయమాటలు నమ్మొద్దని స్థానికులకు సూచించారు. ఇలాంటి కేటుగాళ్లు కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
Also Read
ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ విషయాలు తప్పనిసరి.. !
“కర్ణన్” గా రాబోతున్న ధనుష్