Thursday, April 25, 2024
- Advertisement -

ఇక యుగం అంతం కానుందా?

- Advertisement -

యుగాంతం.. ఈ ప‌దాన్ని ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వింటున్నాం.. 2012లో షురూ అయినా ఈ మాట‌. నేడు ఏ వైప‌రిత్యం ఎదురైనా కూడా యుగాంతం రాబోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక 2020లో కరోనా వచ్చినప్పుడైతే ఇది నిజ‌మేన‌ని ఎంతో మంది న‌మ్మేశారు. అనుకోకుండా కరోనాను మానవాళి జయించడంతో ఈ అంచనాలు త‌ప్పినాయి. మ‌ళ్లీ వచ్చే నెల్లో భూగోళానికి పెను ముప్పు పొంచి ఉంద‌ని, దాంతో యుగాంతం రానుంద‌ని ఒక ప్ర‌చారం జ‌రుగుతోంది.

మార్చిలో మునుపు ఎన్న‌డూ చూడనంత పెద్ద గ్రహశకలం భూమికి సమీపంలోకి రానుంది. అయితే ఇది ప‌క్క‌గా భూమిని ఢీ కొట్ట‌నుంద‌ని అమెరికాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. సైంటిస్టులు అలాంటిదేమీ జ‌ర‌గ‌ద‌ని చెప్తున్నా.. అక్క‌డి కొంత మంది యుగాంతం అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. దీనిపై సైంటిస్టులు మాట్లాడుతూ మార్చి 21న భారీ ఆస్టరాయిడ్ భూమికి సమీపంలోకి రానున్నమాట నిజ‌మేన‌ని తెలిపారు.

కానీ భూమిని ఢీకొట్టడం జ‌ర‌గ‌ద‌ని తేల్చిచెప్పారు. అలాగే ఈ ఆస్టరాయిడ్ లు ఎన్నో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని తెలిపారు. అవి భూమికి ద‌గ్గ‌ర‌కు రావ‌డం చాలా సాధార‌ణ‌మ‌ని తెలిపారు. ఇది ద‌గ్గ‌ర‌కు వ‌స్తే.. భూమిని తాకుతాయని కాదని తెలిపారు. వీటిని ఎప్పుడూ పరిశీలిస్తూ ఉంటామని సెంటర్‌ ఫర్‌ ఎన్‌ఈఓ డైరెక్టర్‌ పాల్‌ చోడస్ తెలిపారు. అందుకే ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని సూచించారు.

ఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ లైంగిక దాడి

ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ విషయాలు తప్పనిసరి.. !

వాళ్లిద్దరిలో ‘మెగా’ ఛాన్స్ ఎవరికి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -