కత్రినా కావాలా? కరీనా కావాలా?

- Advertisement -

మీకు కత్రినా కావాలా? లేక కరీనా కావాలా? పోనీ సల్మాన్‌ కావాలా? కంగారు పడకండి.. ఈ పేర్లు చెప్తే స్టార్లు కాదు వచ్చేది.. డ్రగ్స్, అవును. హైదరాబాద్‌ డ్రగ్స్ రాకెట్‌ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ముంబైలో సప్లై చేసే డ్రగ్స్‌కి హీరో హీరోయిన్ల పేర్లతో కోడ్‌ లాంగ్వేజ్ సెట్‌ చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఆర్డీఎక్స్‌, ఎండీ, స్టఫ్, మాల్‌ పేర్లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా, ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గ్యాంగ్‌ లు ఇక్కడ వేలు లక్షలు సంపాదిస్తున్నాయని పోలీసుల సమాచారం. అయితే దీని వెనుక ఎవరున్నారనే అంశంపై దర్యాప్తు నడుస్తోంది.

సముద్ర మార్గం ద్వారా గోవా, ముంబైలకు వస్తున్న డ్రగ్స్ అక్కడినుండి హైద్రాబాద్‌కు చేరుతున్నాయని గుర్తించారు. అయితే, హైదరాబాద్‌ డ్రగ్స్‌ రాకెట్‌ లో ఏకంగా స్కూల్‌ పిల్లలతో డ్రగ్స్‌ను సరఫరా చేపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలైతే ఎలాంటి అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ స్కెచ్‌ వేశారని తెలుస్తోంది. సికింద్రాబాద్, పాతబస్తీ, జీడిమెట్ల, కూకట్‌పల్లి, గోల్కోండల్లో డ్రగ్స్ మాఫియా అడ్డాలున్నాయని సమాచారం సేకరించారు పోలీసులు.

నిన్నటిదాకా డ్రగ్‌ పెడ్లర్స్‌ అంటే నైజీరియన్లు ఉంటారని భావించేవారు. కానీ, ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా వాడుకుంటున్నారని తేలటం సంచలనం కలిగిస్తోంది. ఆ మధ్య హైదరాబాద్‌ లో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పిల్లలకు డ్రగ్స్‌ సరఫరా జరిగినట్టు తేలింది. అంటే డ్రగ్స్‌ బ్యాచ్‌ ప్రమాదం నుండి పిల్లలు ఇంకా బయటపడలేదన్నమాట.

కన్నబిడ్డల్ని చంపిన తండ్రి

రైల్వే స్టేషన్ వెళుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..

కన్న కొడుకుపై తండ్రి లైంగిక దాడి

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -