- Advertisement -

గచ్చిబౌలిలో హిట్ అండ్ రన్ కేసు..సీసీ ఫుటేజ్

- Advertisement -

గచ్చిబౌలిలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ బెంజ్ కారు ఢీకొట్టిన ఘటన సీసీ ఫుటేజ్‌లో రికార్డైంది. నార్సింగి ప్రాంతంలో హిట్ అండ్ రన్ చేసి పారిపోయిన బెంజ్ కారు గచ్చిబౌలి వైపు వస్తోందని కంట్రోల్ రూమ్ నుంచి ట్రాఫిక్ పోలీసులకు అలర్ట్ వెళ్లింది.

అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ మొదట కారును ఆపినట్లు నటించి, వెంటనే వేగం పెంచాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కార్ బ్యానెట్‌పై పడగా, డ్రైవర్ అతడిని దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడికక్కడే ఇతర పోలీసులు వెంటాడి కారును ఆపించారు.

చివరికి డ్రైవర్‌ను పట్టుకుని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -