ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో మాట్లాడిన ఆయన, ప్రపంచ రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న శక్తివంతుల గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ….వాళ్లు రాక్షస స్వభావంతో వ్యవహరిస్తున్నారు అన్నారు. ప్రపంచంలో పెరుగుతున్న అసమానతలు, యుద్ధ వాతావరణం, సాంకేతిక ఆధిపత్యం వంటి అంశాలను ఉదాహరణగా చూపిస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితులను సరిచేయడానికి దైవ శక్తి అవతరించాల్సిన అవసరం ఉందని, ధర్మ పరిరక్షణ కోసం శ్రీమహా విష్ణువు రావాల్సిందే అని వ్యాఖ్యానించారు.
గరికపాటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొందరు ఆయన అభిప్రాయాలను సమర్థిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే గరికపాటి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చకు దారితీశాయి.
