- Advertisement -

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసు..వీడిన మిస్టరీ

- Advertisement -

విజయవాడలో సంచలనం రేపిన డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీపిక ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిగా అతనిపై ఆరోపణలు రావడంతో పోలీసులు విచారణ చేపట్టి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అనంతపురం మెడికల్ కాలేజీలో చదువుకున్న డాక్టర్ దీపిక ప్రస్తుతం విజయవాడలోని జీజీహెచ్‌లో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఇదే సమయంలో నందిగామలో ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేస్తున్న అమర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అయితే దీపికను ప్రేమిస్తున్నప్పటికీ అమర్ మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన దీపిక గత నెల 5వ తేదీన ప్రమాదకరమైన ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె అమర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు కూడా విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు అమర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణ అనంతరం అమర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అమర్‌ను విజయవాడ జైలుకు తరలించారు. ఈ ఘటన వైద్య వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -