- Advertisement -

శాంసన్‌పై గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

- Advertisement -

సంజూ శాంసన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోచ్ గౌతమ్ గంభీర్. టీ20 ప్రపంచకప్ సమయంలో సామ్‌సన్‌ను మధ్యలో జట్టులోకి తిరిగి తీసుకోవడం ధైర్య నిర్ణయం కాదని, అది పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయమని గంభీర్ స్పష్టం చేశారు.

టీ20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లలో భారత జట్టులో సామ్‌సన్‌కు అవకాశాలు తక్కువగా వచ్చాయి. తొలి ఐదు మ్యాచ్‌లలో ఆయన కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. అయితే సూపర్ ఎయిట్ దశలో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చిన సామ్‌సన్ అద్భుత ప్రదర్శన చేశాడు. వరుసగా మూడు కీలక మ్యాచ్‌లలో మూడు అర్ధశతకాలు సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ ప్రదర్శనతో టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సామ్‌సన్ ఆశించినంతగా రాణించలేకపోయాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్ నంబర్ 3 స్థానంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో జట్టు మేనేజ్‌మెంట్‌కు కొన్ని కాంబినేషన్ సమస్యలు ఏర్పడ్డాయి. అయితే పై వరుసలో ఎక్కువ మంది ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో ప్రత్యర్థి జట్లు ఆఫ్ స్పిన్నర్లను సమర్థంగా వినియోగించాయి. దీంతో జట్టులో కొంత మార్పు అవసరమని భావించిన మేనేజ్‌మెంట్ శాంసన్‌ను తిరిగి తీసుకుంది.

ఈ విషయంపై గంభీర్ మాట్లాడుతూ …శాంసన్ అవుట్ ఆఫ్ ఫార్మ్‌లో ఉన్నాడని మేమెప్పుడూ భావించలేదు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత అతనికి కొద్దిసేపు విరామం ఇవ్వడం మంచిదని అనుకున్నాం. కొన్నిసార్లు ఆటగాడికి ఒత్తిడి నుంచి బయటపడేందుకు బ్రేక్ అవసరం ఉంటుంది. అలా తిరిగి వచ్చి అతను అద్భుతంగా రాణించాడు అన్నారు.

భారత జట్టు బలమైన స్థాయికి రావడంలో మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సలెక్టర్ అజిత్ అగార్కక్ కృషి ఎంతో ఉందన్నారు గంభీర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -