- Advertisement -

బాల‌కృష్ణ ఇలాకాలో రౌడీషీటర్ ఘాతుకం

- Advertisement -

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. చిలమత్తూరు మండలం ఎర్రకొండ వద్ద రౌడీషీటర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒక కేసులో నిందితుడైన రౌడీషీటర్ నాగేంద్రను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు కానిస్టేబుల్ రవిపై అతడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై ఈ విధమైన దాడి జరగడం తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఆకస్మికంగా జరిగిన కత్తి దాడిలో కానిస్టేబుల్ రవి తీవ్రంగా గాయపడగా, తోటి సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రవి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రౌడీషీటర్ నాగేంద్రను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు సహించబోమని పోలీసులు హెచ్చరిస్తూ, నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటన పోలీసు భద్రత, ప్రజా శాంతి పరిరక్షణపై మరోసారి చర్చకు దారి తీసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -