- Advertisement -

సూర్యాపేటలో ప్రేమోన్మాది ఘాతుకం

- Advertisement -

సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాదిగా మారిన ఓ యువకుడు, తనను దూరం పెడుతోందనే అక్కసుతో యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా యువతి తనతో మాట్లాడటం మానేసిందని భావించిన నిందితుడు, ప్రతీకారంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.

ఇంట్లోకి చొరబడి సుత్తెతో పదేపదే దాడి చేయడంతో యువతి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావంతో కుప్పకూలిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

దాడి అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో మహిళల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యువతులపై వేధింపులు, ప్రేమ పేరుతో జరిగే దాడులను కఠినంగా అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -