- Advertisement -

వందల మంది అత్యాచారం.. బ్రిటీష్ ఎంపీ సంచలన ప్రకటన

- Advertisement -

యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లో దశాబ్దాలుగా సాగుతోన్న బాలల లైంగిక దోపిడీ ముఠాలు, అపఖ్యాతి పాలైన “పాక్‌గ్రూమింగ్ గ్యాంగ్స్” (Pakistani Grooming Gangs) వ్యవహారంపై బ్రిటీష్ పార్లమెంట్‌లో తీవ్రమైన చర్చ రేగింది. బ్రిటీష్ ఎంపీ రూపెర్ట్ లోవ్ (Rupert Lowe) ఈ ముఠాల బాధితుల నుండి తాను స్వయంగా సేకరించిన అత్యంత హృదయవిదారక, షాకింగ్ నిజాలను హౌస్ ఆఫ్ కామన్స్‌లో చదివి వినిపించారు. ప్రధానంగా పాకిస్తానీ మూలాలున్న టాక్సీ డ్రైవర్లు, స్థానిక వ్యాపారస్తులు శ్వేతజాతీయులైన క్రైస్తవ మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని దశాబ్దాలుగా ఈ క్రూరమైన లైంగిక దాడులకు తెగబడుతున్నారని బ్రిటీష్ ప్రభుత్వ అంతర్గత విచారణలు సైతం స్పష్టం చేశాయి.

పార్లమెంట్‌లో ఎంపీ లోవ్ వెల్లడించిన సాక్ష్యాల ప్రకారం.. ఒక బాధితురాలు తాను కేవలం 13 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుండి మూడేళ్ల పాటు దాదాపు 600 నుండి 700 మంది పురుషుల చేతిలో దారుణమైన అత్యాచారానికి గురైనట్లు పేర్కొంది. నిందితులు చిన్నారి బాలికలను జంతువుల కంటే హీనంగా చూసేవారని, ఒకే వ్యాన్‌లో 15 నుండి 20 మంది అమ్మాయిలను కుక్కల బోనుల్లో బంధించి ఉంచేవారని విచారణలో తేలింది. ముస్లిం బాలికలకు మాత్రమే నైతిక విలువలు ఉంటాయని, శ్వేతజాతీయులైన క్రైస్తవ బాలికలకు నైతికత ఉండదనే వికృత భావజాలంతోనే నిందితులు ఈ దారుణాలకు పాల్పడేవారని, ముఖ్యంగా ‘ఈద్’ వంటి పండుగలు, సెలవు రోజుల్లో ఈ హింస మరీ ఎక్కువగా ఉండేదని బాధితులు వాపోయారు.

అయితే, సమాజాన్ని అత్యంత కలచివేసే అంశం ఏంటంటే.. ఈ ఘోరాలు సాగుతున్న సమయంలో కొందరు స్థానిక పోలీసు అధికారులు సైతం బాధితులపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తీవ్ర గాయాలతో 15 ఏళ్ల వయసులో ఆసుపత్రికి వెళ్తే, భయంతో నిజం చెప్పలేకపోయిన తరుణంలో అక్కడి వైద్య సిబ్బంది కూడా కనీస ప్రశ్నలు అడగకుండా కేవలం టాబ్లెట్లు ఇచ్చి పంపించేశారని బాధితులు తెలిపారు. ఒక ఇమామ్ (ముస్లిం మత గురువు) కుమారుడి వల్ల ఒక మైనర్ బాలిక గర్భవతి కాగా, ఆ విషయం తెలిసి కూడా సదరు తండ్రి తన కొడుక్కి వేరే పెళ్లి చేసి ఆ బిడ్డను చూడవద్దని ఆదేశించాడని, వారు కేవలం తమ వర్గాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని బాధితురాలు పేర్కొంది.

గతేడాది ఎంపీ రూపెర్ట్ లోవ్ నేతృత్వంలో జరిగిన ఒక స్వతంత్ర ప్రైవేట్ దర్యాప్తులో.. యూకే వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో ఇటువంటి భయంకరమైన “రేప్ గ్యాంగ్స్” చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. బ్రిటన్ లోని ప్రభుత్వ సంస్థలు, రక్షణ వ్యవస్థలు, స్థానిక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం, ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దశాబ్దాల పాటు ఈ క్రూరమైన సామాజిక విపత్తు ఇంతలా విస్తరించిందని ఆగస్టులో విడుదల చేసిన ఒక అధికారిక నివేదికలో లోవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సాక్ష్యాలు వెలుగులోకి రావడంతో యూకేలో లా అండ్ ఆర్డర్, వలసదారుల నేరాలపై సరికొత్త చట్టాల కోసం ఒత్తిడి పెరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -