గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తాజా రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) విడుదల హడావుడిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చరణ్ తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ముగ్గురు పిల్లల తండ్రిగా తనకున్న అనుభవాల గురించి ఎంతో సరదాగా ముచ్చటించారు.
తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి ముగ్గురు పిల్లలు—కూతురు క్లిన్ కారా, కవలలు (ట్విన్స్) శివరామ్, అన్విరా దేవిలకు జన్మనిచ్చిన చరణ్, ఇంట్లో తాను ఒక బాధ్యతాయుతమైన ‘తండ్రిని అని చెప్పుకొచ్చారు. అయితే, పిల్లల విషయంలో తాను అస్సలు చేయలేని ఒకే ఒక్క పని గురించి చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. “నేను ఒక మంచి తండ్రినా లేక సాధారణ తండ్రినా అనేది నాకు తెలియదు కానీ, పిల్లల పనుల్లో మాత్రం ఎప్పుడూ ముందుంటాను. వారికి తినిపించడం, జోలపాడి నిద్రపుచ్చడం లాంటివన్నీ చూసుకుంటాను. ముఖ్యంగా క్లిన్ కారా దాదాపు ప్రతి రాత్రి నా పక్కనే పడుకుంటుంది. ఒక సగటు తండ్రి చేసే పనులన్నీ నేను చేస్తాను.. కానీ, ఆ డైపర్లు మార్చే (Diaper Changing) పని మాత్రం నా వల్ల కాదు. ఇంట్లో ఆ డైపర్లు మార్చే సమయం రాగానే, నేను ఎవరికీ తెలియకుండా గదిలో నుండి మెల్లగా జారిపోతాను” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. చరణ్.. తాను పిల్లల పనులన్నీ చూసుకుంటూ కేవలం డైపర్ల విషయంలోనే జారిపోతానని చాలా ప్రాక్టికల్‌గా, హ్యూమరస్‌గా చెప్పడంతో నెటిజన్లు దీనిని ఒక ఫన్నీ సెలబ్రిటీ అప్‌డేట్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక బుచిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న విడుదల కానుండగా, ఒకరోజు ముందుగానే జూన్ 3న ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. అక్కడ ముందస్తు బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో, నార్త్ అమెరికాలో రిలీజ్‌కు ముందే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ప్రీమియర్స్‌లోనే వన్ మిలియన్ క్లబ్‌లోకి చేరిన చరణ్ ఏకైక చిత్రమిదే.
