- Advertisement -

అజార్‌కు కేటాయించిన శాఖలివే

- Advertisement -

తెలంగాణ మంత్రి అజారుద్దీన్‌కు శాఖలను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అజహరుద్దీన్‌కు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ప్రముఖ సంస్థలు) మరియు మైనార్టీ సంక్షేమ శాఖలను కేటాయించారు. ఇంతకుముందు, ఆయనకు హోమ్ శాఖ ఇవ్వబోతున్నారని ఊహాగానాలు వచ్చినప్పటికీ, తాజా ప్రకటనతో ఆ అనుమానాలకు తెరపడింది.

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖను ఇంతకుముందు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటుండగా, అడ్లూరి లక్ష్మణ్ కుమార్..మైనార్టీ సంక్షేమశాఖను నిర్వహించారు.
తాజాగా ఈ రెండు శాఖలను అజార్‌కు కేటాయించారు.

అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు అజార్‌. అయితే అజార్ ప్రమాణ స్వీకారంపై విమర్శలు సైతం వచ్చాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలోనే అజార్‌ను మంత్రిగా నియమించారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -