- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్ బై

- Advertisement -

టీం ఇండియా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. అభిమానులతో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. ‘సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాలి’ అని తన అంతర్జాతీయ రిటైర్మెంట్ గురించి రహానే ప్రకటన చేసాడు.

ఆస్ట్రేలియాపై బోర్డర్-గావస్కర్ 2020-21ట్రోఫీని గెలిచిన టీమిండియాలో అజింక్య రహానే ఒక సభ్యుడు. ఆ సిరీస్ విజయంతో భారత క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. రహానే తన కెరీర్ మొత్తంలో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20ఐ మ్యాచ్‌లు ఆడాడు. ఈ 195 మ్యాచ్‌ల్లో రహానే 8,414 పరుగులు సాధించాడు. అతను ఆరు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 212 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కూడా ఆడాడు. ఆసీస్ గడ్డ పైన కోహ్లీ రెగ్యులర్ కెప్టెన్ గా ఆడుతున్న సమయంలో.. విరాట్ వ్యక్తిగత వ్యవహారాలతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో జట్టు లో అనుభవం లేని ఆటగాళ్లతో ఆసీస్ ను సొంత గడ్డ పైన తాత్కాలిక కెప్టెన్ గా ఓడించిన రెహానే కొత్త రికార్డు నెలకొల్పాడు.

రిటైర్మెంట్ సందేశంలో రెహానే కీలక అంశాలను ప్రస్తావించాడు. ‘జీవిత వాస్తవం ఏమిటంటే, ప్రతిదానికీ ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంటుంది. సమయం వచ్చినప్పుడు, దాన్ని గౌరవించి ముందుకు సాగాలి. నేను నా బ్యాటింగ్‌లో ఎల్లప్పుడూ సమయంపై ఆధారపడ్డాను. అలానే దాని ప్రాముఖ్యతను ఎల్లప్పుడూ అర్థం చేసుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్‌ను ప్రకటించి ముందుకు సాగడానికి ఇదే నాకు సరైన సమయం అనిపిస్తోంది. చిన్న వయసులో కేవలం ప్రాక్టీస్ కోసం డోంబివ్లి నుంచి ప్రయాణించిన చివరకు ఈ ఆట కోసం నా సర్వస్వాన్ని అర్పించాను’ అని రహానే పేర్కొన్నాడు. ఆటగాడిగా తన కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నప్పటికీ, తాను క్రికెట్‌కు మాత్రం సన్నిహితంగా ఉండాలనుకుంటున్నట్లు రెహానే తన రిటైర్మెంట్ గురించి ప్రకటనలో వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -