- Advertisement -

జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం

- Advertisement -

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జేసీకి అపాయింట్మెంట్ ఇవ్వ‌లేదు అనంతపురం ఎస్పీ జగదీష్. ఐపీఎస్ అధికారి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఎస్పీ జగదీష్. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు జేసీ. గంట సేపు వేచి ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎస్పీ జగదీష్. దీంతో చేసేదేమి లేక వెనుదిరిగారు.

ఇప్పటికే జేసీ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు అనంతపురం ఎస్పీ జగదీష్. జేసీ బెదిరింపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జేసీ వ్యాఖ్యలు ఐపీఎస్ అధికారిని థ్రెటన్ చేసేలా ఉన్నాయి… జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద ఉన్న తుపాకుల లైసెన్స్ రద్దు చేసే అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం … పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పాలి ..చపరిచేలా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడటం సరికాదు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -