Thursday, May 8, 2025
- Advertisement -

పవన్ మరో రాంగ్ స్టెప్‌..?

- Advertisement -

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ముప్పేట దాడి చేస్తున్నారు జనసైనికులు. టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్‌లో పవన్ పార్టీకి 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఇస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. దీంతో జనసైనికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. సీట్లు ఆశీంచి భంగపడ్డ నేతలంతా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇక కాపు సామాజిక వర్గ పెద్దలైతే పవన్ తమ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని తీవ్రంగా విమర్శించారు కూడా.

ఈ క్రమంలో సెకండ్ లిస్ట్‌పై పలుమార్లు చంద్రబాబుతో సమావేశం అయ్యారు పవన్‌. ఇక సెకండ్ లిస్ట్‌లో జనసేనకు కొన్ని సీట్లు వస్తాయని ప్రచారం జరిగింది. కానీ సీన్ హస్తినకు చేరిన తర్వాత పూర్తిగా రివర్స్ అయింది. జనసేన -బీజేపీకి కలిసి 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు.

దీంతో జనసేన 24 అసెంబ్లీ స్థానాలకే పరిమతం కావాల్సి రాగా ఇప్పుడు మరో ఎంపీ సీటు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమకు ఆరు ఎంపీ సీట్లు ఇస్తేనే కూటమిలో చేరుతామని బీజేపీ అగ్రనేత అమిత్ షా తేల్చిచెప్పడంతో చివరకు ప్యాకేజీ స్టార్ పవన్ కాంప్రమైజ్ కావాల్సి వచ్చిందని టాక్. తొలుత జనసేనకు కేటాయించిన కాకినాడ,మచిలీపట్నం,అనకాపల్లి స్థానాల్లో కాకినాడను వదులుకునేందుకు పవన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలే టీడీపీ కేటాయించడంతో పవన్‌పై బీజేపీ నేతలు ఒత్తిడి తెస్తే జనసేనకు కేటాయించిన 24 స్థానాల్లో రెండు,మూడు స్థానాలు వదులుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా తాను సీఎం అవుతానని ఎన్నికల ముందు వరకు డబ్బా కొట్టిన పవన్ చివరకు తప్పుడు నిర్ణయాలతో ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -