- Advertisement -
ఏపీలో కాంగ్రెస్ – సీపీఐ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా సీపీఐ ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.114 అసెంబ్లీ,5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిచంగా షర్మిల కడప పార్లమెంట్ బరిలో నిలిచారు.
ఇక తాజాగా సీపీఐ అభ్యర్థులను ప్రకటించింది. గుంటూరు పార్లమెంట్ నుండి జంగాల అజయ్ కుమార్, విశాఖ పశ్చిమ – అత్తిలి విమల,ఏలూరు – బండి వెంకటేశ్వరరావు,విజయవాడ పశ్చిమ – జి. కోటేశ్వరరావు,అనంతపురం అర్బన్ – సీ. జాఫర్,పత్తికొండ – పి. రామచంద్రయ్య,తిరుపతి – పి. మురళి,
రాజంపేట – భూక్య విశ్వనాథ నాయక్,కమలాపురం – గాలి చంద్ర పోటీ చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
ఎన్నికల రేసులో జగన్ సింగిల్‌గా వస్తుండగా టీడీపీ – జనసేన -బీజేపీ కూటమిగా వస్తున్నాయి.