Monday, May 6, 2024
- Advertisement -

చంద్రబాబు గెలుపు మీడియాలోనేనా?

- Advertisement -

ఏపీలో ఎన్నికల హడావిడి తారాస్ధాయికి చేరింది. జగన్ నేతృత్వంలోనే వైసీపీని ఓడగొట్టేందుకు తన రాజకీయ చతురతను అంతా ఉపయోగిస్తున్నారు చంద్రబాబు. ఇక ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండగా ఇప్పటికే నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తుండగా చంద్రబాబు సైతం ప్రాజెక్టుల సందర్శన అంటూ నిత్యం జనంలో ఉండేలా ప్లాన్ సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా టీడీపీ పరిస్థితి ఏంటా అన్నది తెలియక తెలుగు తమ్ముళ్లు లోలోపల అయోమయంలో ఉన్నారు.

మీడియాను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. చంద్రబాబు ప్రధాన అస్త్రాల్లో మీడియా ఒకటి. ఆయన ఏం చేసినా అంటే తప్పు చేసినా దానిని గొప్పగా చూపించడంలో ఎల్లో మీడియాలో స్ట్రేటజీనే వేరు. చంద్రబాబు తప్ప వేరే ఎవరు లేరు..రారు అన్నట్లుగా జనం మైండ్‌సెట్‌ని ప్రభావితం చేస్తారు. ఇక తాజాగా ఇప్పుడు అదే జరుగుతోంది.

ఏపీలో జగన్ శకం ముగిసిందని..బైబై జగన్‌ అంటూ మీడియాలో,సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాబోయేది చంద్రబాబేనని గొప్పలు చెబుతున్నారు. కానీ గ్రౌండ్ రియాల్టీ, క్షేత్రస్ధాయిలో పరిశీలిస్తే వచ్చేది జగన్ సర్కారేనని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక తాజాగా ఓ సర్వే ప్రకారం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ దాదాపు 165 ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ గెలుపొందే అవకాశం ఉందని, 24 ఎంపీ స్థానాలు వైసీపీవేనని తేల్చింది.

దీంతో పలు సర్వేల పేరిట టీడీపీ అండ్ కో చేస్తున్న ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది.దీనికి తోడు అక్రమాస్తుల కేసు అంటూ చంద్రబాబుకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఏదిఏమైనా బీజేపీతో జతకడితే ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు భావించిన బాబుకు ఐటీ నోటీసులు మరింత తల నొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -