Sunday, June 16, 2024
- Advertisement -

వారసులు గెలిచి సత్తా చాటేనా?

- Advertisement -

ఏపీ ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. గెలుపు, ఓటములపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా బెట్టింగ్ మాత్రం జోరుగా సాగుతోంది. అభ్యర్థుల గెలుపు దగ్గరి నుండి, అధికారంలోకి వచ్చే పార్టీ,మెజార్టీ, ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అన్న దానిపై జోరుగా పందెం కాస్తున్నారు.

ఇక ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన వారసులు విజయం సాధిస్తారా అన్న దానిపై కూడా జోరుగా పందెంతో పాటు బెట్టింగ్ జరుగుతోంది. ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలిగా ఉన్న ష‌ర్మిల క‌డ‌ప లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఆమె గెలుపు సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది.

అలాగే బాల‌కృష్ణ‌, చంద్రబాబు తనయుడు లోకేష్, మాజీ సీఎంలు నాదెండ్ల భాస్క‌రరావు త‌న‌యుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ , కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి కొడుకు సూర్య ప్ర‌కాశ్ రెడ్డి , నేదురుమిల్లి జ‌నార్ధ‌న్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా వీరి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారా అన్న దానిపై చర్చ జరుగుతోండగా ఎవరిని అదృష్టం వరిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -