ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ మొత్తంలో 81.76శాతం పోలింగ్ నమోదుకాగా .. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.1 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87.09 శాతం నమోదుకాగా అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 68.63 శాతం నమోదైంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ని పరిశీలిస్తే దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం,
తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఒంగోలు పార్లమెంటుకు అత్యధికంగా 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ పార్లమెంటుకు 71.11 శాతం పోలింగ్ నమోదైంది. అల్లూరి జిల్లాలో 70.20 శాతం,అనకాపల్లి జిల్లాలో 83.84 శాతం,అనంతపురం జిల్లాలో 81.08 శాతం,అన్నమయ్య జిల్లాలో 77.83 శాతం,బాపట్ల జిల్లాలో 85.15శాతం,చిత్తూరు జిల్లాలో 87.09 శాతం,కోనసీమ జిల్లాలో 83.84 శాతం,తూ.గో. జిల్లాలో 80.93 శాతం,ఏలూరు జిల్లాలో 83.67 శాతం పోలింగ్ నమోదైంది.
గుంటూరు జిల్లాలో 78.81 శాతం,కాకినాడ జిల్లాలో 80.31 శాతం,కృష్ణా జిల్లాలో 84.05 శాతం,కర్నూలు జిల్లాలో 76.42 శాతం,నంద్యాల జిల్లాలో 82.09 శాతం,ఎన్టీఆర్ జిల్లాలో 79.36 శాతం,పల్నాడు జిల్లాలో 85.65 శాతం,పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10 శాతం,ప్రకాశం జిల్లాలో 87.09 శాతం,నెల్లూరు జిల్లాలో 79.63 శాతం,శ్రీసత్యసాయి జిల్లాలో 84.63 శాతం,శ్రీకాకుళం జిల్లాలో 75.59 శాతం,తిరుపతి జిల్లాలో 78.63 శాతం,విశాఖ జిల్లాలో 68.63 శాతం,విజయనగరం జిల్లాలో 81.33 శాతం,ప.గో. జిల్లాలో 82.59 శాతం,
వైఎస్‌ఆర్ జిల్లాలో 79.58 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు అధికారులు.