- Advertisement -

ఆసియా కప్‌..ఆప్ఘాన్ వర్సెస్ హాంకాంగ్

- Advertisement -

ఆసియా కప్ 2025 నేటి నుండి ప్రారంభంకానుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ గ్రూప్–Bలో భాగంగా ఆఫ్ఘానిస్తాన్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది.

యూఏఈలో జరిగిన త్రై సిరీస్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసిన ఆఫ్ఘానిస్తాన్, అద్భుతమైన ఆటతీరును చూపించింది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్‌ నుండి కీలక ఇన్నింగ్స్, బౌలర్ల నుండి గేమ్ మార్చే స్పెల్స్‌తో జట్టు మంచి సత్తా చాటింది. రషీద్ ఖాన్ నాయకత్వంలో ఆఫ్ఘాన్ జట్టు ఇబ్రాహీం జాద్రాన్, అనుభవజ్ఞుడు మొహమ్మద్ నబీ, వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ వంటి ఆటగాళ్లపై ఆధారపడనుంది.

ఇక హాంకాంగ్ జట్టు చివరిసారిగా ఆసియా పసిఫిక్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ 2025లో ఆడింది. ఇరు జట్లు 5 మ్యాచ్‌లు ఆడగా ఆఫ్ఘాన్ 3 మ్యాచ్‌ల్లో హాంకాంగ్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

ఆఫ్ఘానిస్తాన్ (AFG):
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (wk), ఇబ్రాహీం జాద్రాన్, సెదికుల్లా అతల్, దర్వీష్ రసూలీ, కరీమ్ జనత్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మొహమ్మద్ నబీ, ఏఎం ఘజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూకీ

హాంకాంగ్ (HK):
యాసిం ముర్తజా (కెప్టెన్), అన్షీ రాథ్, మార్టిన్ కోయ్జీ, కించిత్ షా, షాహిద్ వసీఫ్, జీషాన్ అలీ (wk), ఐజాజ్ ఖాన్, నిజాకత్ ఖాన్, అతీక్ ఇక్బాల్, అలీ హసన్, ఇహ్సాన్ ఖాన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -