- Advertisement -

అన్నదాతలకు అండగా వైసీపీ

- Advertisement -

వైసీపీ చేపట్టిన అన్నదాత పోరుకు భారీగా తరలివచ్చారు రైతులు. రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాలకు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు. కర్నూల్ జిల్లా ఆలూరు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మరియు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో పత్తికొండలో అన్నదాత పోరు కార్యక్రమంకు భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. ఇక ప్రొద్దటూరులో రాచమల్లు ఆధ్వర్యంలో తీవ్ర ఉద్రిక్తల నడుమ అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది.

ఎరువులను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని రైతన్నను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. తెనాలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించిన సరే అన్నదాత పోరు నిరసన కార్యక్రమం ఆగలేదు.

రైతుల పక్షాన పోరాడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, శ్రేణులను ముందస్తు అరెస్టులు అడ్డంకులతో నిలువరించలేరూ అని చాటిచెప్పింది అన్నదాత పోరు శాంతియుత ర్యాలీ కార్యక్రమం. రాజమండ్రిలో వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద బారికెట్లు ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా గణపతి బప్పా మోరియా రైతులకు ఇవ్వాలయ్యా యూరియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నందిగామ అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ , తిరువూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ , మాజీ జెడ్పీ ఛైర్మన్, నల్లగట్ల సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -