Thursday, May 2, 2024
- Advertisement -

బాక్సాఫీస్ దగ్గర బేబీ కుమ్ముడు..!

- Advertisement -

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన బేబీ సినిమా సెన్సేషనల్ హిట్ దిశగా పరుగులు తీస్తుంది. లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేశారు. సినిమాను ఎస్.కె.ఎన్ నిర్మించారు. సినిమా మొదటి రోజు 2.60 కోట్లు కలెక్ట్ చేయగా ఐదో రోజు అది కూడా వీక్ డే లో 2.94 కోట్లు రాబట్టింది.

సినిమాకు రోజు రోజుకి మౌత్ టాక్ తో బీభత్సమైన వసూళ్లు వస్తున్నాయి. ఏపీ తెలంగాణాలో ఐదు రోజుల్లో బేబీ సినిమా 16.01 కోట్ల షేర్ 28.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా బేబీ వసూళ్లు చూస్తే.. ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 34.90 కోట్ల గ్రాస్ అంటే 18.71 కోట్ల షేర్ రాబట్టింది.

బేబీ సినిమా 7.40 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అవగా సినిమా అన్ని చోట్ల సూపర్ ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది. బేబీ లాంగ్ రన్ లో 50 నుంచి 70 కోట్ల దాకా కూడా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -