Sunday, April 28, 2024
- Advertisement -

ప్రాజెక్ట్ K పోస్టర్ పై అసంతృప్తి.. ఎక్కడ తేడా కొట్టింది..?

- Advertisement -

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఐరన్ మ్యాన్ రూపం లో ఉన్నాడు. అయితే ఈ పోస్టర్స్ చూసిన కొందరు ఐరన్ మ్యాన్ ముఖానికి ప్రభాస్ ఫేస్ అతికించినట్టు ఉంది తప్ప అంత బాగా లేదని కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫోటో ఏదో మార్ఫింగ్ ఫోటో తరహాలో ఉంది తప్ప అంత కిక్ ఇవ్వలేదు. కొందరైతే ప్రభాస్ ఆదిపురుష్ ఫేస్ ని ఐరన్ మ్యాన్ ని తగిలించారని అంటున్నారు.

ఆదిపురుష్ ఇంప్యాక్ట్ ఇంకా ప్రభాస్ సినిమాల మీద ఉందని చెప్పొచ్చు. నాగ్ అశ్విన్ అభిరుచి గల దర్శకుడే ఆయన తీసిన మహానటి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాంటి నాగ్ అశ్విన్ ఇంత భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ గురించి ఇలా ఎలా చేశాడని ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కమల్ హాసన్ నటిస్తున్నారు. దీపిక పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -