సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే ప్రధాన మార్గాలలో APK ఫైళ్లు ఒకటి. .Apk అనే ఎక్స్‌టెన్షన్‌తో ఉన్న ఏ ఫైల్‌ను కూడా, అది అధికారిక యాప్ స్టోర్ (Google Play Store) నుండి రాని పక్షంలో, ఏ పరిస్థితిలోనూ ఓపెన్ చేయకూడదు.
మీ ఫోన్లో APK ఫైల్‌ను ఇన్స్టాల్ చేస్తే, మీ వ్యక్తిగత డేటా దొంగిలించబడుతుంది.మీకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌ను రిమోట్‌గా ఆపరేట్ చేస్తారు.మీ ఫోన్లో ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు, డబ్బు చోరీకి గురయ్యే అవకాశం ఉంది.
ఉదాహరణకు: RTO CHALLAN.apk, Aadhar.Apk, SBI.Apk, pm kisan.Apk, Ekyc.apk వంటి పేర్లతో వచ్చే ఫైళ్లు హ్యాకింగ్‌కు గురి చేస్తాయి. పొరపాటున ఇన్స్టాల్ చేస్తే వెంటనే చేయాల్సినవి:డేటా ఆఫ్: వెంటనే మొబైల్ ఇంటర్నెట్ డేటాను ఆపివేయండి. అన్ఇన్స్టాల్: సెట్టింగ్స్‌లోని యాప్స్‌లోకి వెళ్లి అనుమానాస్పద APK యాప్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి.
అవసరమైతే, ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో రీస్టార్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయండి.పాస్వర్డ్లు మార్చండి: మీ బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా, ఈ-మెయిల్ ఖాతాల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి.స్కాన్ & పరిశీలన: యాంటీ వైరస్ యాప్‌తో ఫోన్‌ను ఫుల్స్కాన్ చేయండి. మెసేజ్‌లు, కాల్ లాగ్‌లు, బ్యాంక్ లావాదేవీలలో అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయేమో పరిశీలించండి.ఫ్యాక్టరీ రీసెట్: అనుమానాస్పద కార్యకలాపాలు ఇంకా కనిపిస్తే, డేటా బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రీసెట్ (Factory Reset) చేయండి.ఫిర్యాదు: ఏదైనా మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతాను స్తంభింపజేసి, 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.జాగ్రత్తగా ఉండండి, అనుమానాస్పద ఫైళ్లను తాకకుండా వెంటనే డిలీట్ చేయండి.
