- Advertisement -
మద్యం కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంతకాలంగా వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జైలులో ఆయన ఆరోగ్యం విషమించడంతో, మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం జైలు అధికారులు ఆయనను వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మరియు ఆయనకు అవసరమైన చికిత్స గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మద్యం కేసులో ఆయన అరెస్ట్ అయిన తర్వాత తరచు చెవిరెడ్డి అనారోగ్యం బారిన పడుతున్నారు.
