- Advertisement -

బీఆర్ నాయుడు కాదు….కామ నాయుడు!

- Advertisement -

టీటీడీ చైర్మన్‌పై కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల వ్యవహారంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలను డీప్ ఫేక్‌గా కొట్టిపారేస్తున్న బీఆర్ నాయుడు వాదనను భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. వీడియోలు నిజమైనవేనని కొందరు AI నిపుణులతో మాట్లాడగా వారు తెలిపారు అని ఆయన పేర్కొన్నారు.

తనపై ఆరోపణలు వెలువడిన వెంటనే వాటిని AI సృష్టించిన నకిలీ వీడియోలుగా పేర్కొనడం బాధ్యతారాహిత్యమని భూమన విమర్శించారు. ఇలాంటి వివాదాల నేపథ్యంలో చైర్మన్ పదవిలో కొనసాగడం సరికాదని, నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అయితే, బీఆర్ నాయుడు ఇప్పటికే ఈ వీడియోలు కట్టుకథలని, రాజకీయ దురుద్దేశంతో తనపై దుష్ప్రచారం జరుగుతోందని స్పష్టం చేస్తూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరోపణల నిజానిజాలు దర్యాప్తు ద్వారా వెలుగులోకి రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -