మరోసారి సొంతపార్టీ బీజేపీపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్న పెద్ద అధికారి మేకప్ మ్యాన్ అని విమర్శించారు. ఆయన టేబుల్ ఎవరు క్లీన్ చేస్తే వాళ్లకే పదవులు దక్కుతాయని… మిగతా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు ఎవరూ కనిపించలేదా? చెప్పాలన్నారు.
నేను చేస్తున్న శ్రీరామనవమి శోభాయాత్రకు తక్కువ మంది వచ్చేలా కొందరు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు అని… కావాలనే అంబర్ పేట్ నుంచి గౌతమ్ రావు శోభయాత్ర చేస్తున్నారు.. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చారు అని దుయ్యబట్టారు.
మేకప్ మెన్ లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లు ఇస్తున్నట్లు ఆరోపించారు. గత పార్ల మెంటు ఎన్నికల్లో హైద్రాబాద్ బిజెపి అభ్యర్థిగా మాధవిలత ప్రకటించగానే రాజాసింగ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి మగాళ్లే దొరకలేదా అని కామెంట్ చేశారు. తాజాగా హైద్రాబాద్ స్థానిక సంస్థల బిజెపి అభ్యర్థిగా గౌతంరావు పేరు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.