Saturday, May 18, 2024
- Advertisement -

గెలిస్తే అంతా మంత్రులే..కానీ గెలిచేది ఎంతమంది?

- Advertisement -

దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షాతో సహ బీజేపీ పాలిత సీఎంలు, కేంద్రమంత్రులు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ అధిష్టానం.

కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, బండి సంజయ్‌, విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అరవింద్‌, మాధవీలత, రఘునందన్‌రావు వంటి సీనియర్లు పోటీ చేస్తుండగా ఎవరికి వారే గెలిస్తే కేంద్రమంత్రులం అవుతామని ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా వీరిలో గెలిచేది ఎంతమంది అన్నదానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే బీజేపీ తరపున గతంలో గెలిచిన బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్‌లపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇదే వీరి గెలుపుపై ఎఫెక్ట్ చూపిస్తుండగా మిగితా వారి పరిస్థితి అలానే ఉంది. దీంతో బీజేపీ నేతలు తమ ఆశ సంగతి పక్కనపెట్టి ముందు గెలుపుపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -