- Advertisement -

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో బోణి కొట్టిన BJP!

- Advertisement -

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో “బీజేపీ” ఒక సీటు గెలుచుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఇది భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ (BJP) కాదు. ఇక్కడ విజయం సాధించింది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (Bangladesh Jatiya Party – BJP). పేరులో సాదృశ్యం ఉండటంతో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ, ఈ రెండు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు.

తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ (Bangladesh Nationalist Party) ఈ ఎన్నికల్లో ప్రధాన విజయాన్ని నమోదు చేసింది. అయితే దాని మిత్రపక్షంగా ఉన్న బంగ్లాదేశ్ జాతీయ పార్టీ ఒక సీటు కైవసం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భోలా-1 నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి అందలీవ్ రెహమాన్ 30 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఈ నియోజకవర్గంలో అందలీవ్ రెహమాన్‌కు 1,05,543 ఓట్లు లభించగా, జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థి ఎండి నజ్రుల్ ఇస్లాం రెహమాన్ 75,337 ఓట్లకే పరిమితమయ్యారు. దాదాపు 30 వేల ఓట్ల తేడాతో బంగ్లాదేశ్ జాతీయ పార్టీ అభ్యర్థి గెలుపొందడం అక్కడి రాజకీయ సమీకరణాల్లో మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.

అదనంగా, ఇదే ప్రాంతంలో పార్లమెంటరీ ఎన్నికలతో పాటు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 1,43,473 మంది సంస్కరణలకు అనుకూలంగా ఓటు వేయగా, 44,731 మంది వ్యతిరేకించారు. ఈ ఫలితాలు బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణంలో కొత్త దిశను సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -