- Advertisement -

బ్లాక్ బ్యూటీ..అందరిచూపు ఆమెపైనే!

- Advertisement -

ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్లు హోరాహోరీగా తలపడుతుంటే గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు మాత్రం మ్యాచ్‌ను మరిచిపోయి ఒకే ఒక్కరి వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నారు. అబ్బబ్బ.. ఏమి అందం! నల్లటి సూట్‌లో మెరిసిపోతూ స్టేడియం మొత్తానికి హైలైట్‌గా నిలిచింది ఆ మిస్టరీ సుందరి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఈ ‘బ్లాక్ బ్యూటీ’ తన స్టైలిష్ లుక్స్‌తో ఊపేస్తోంది.

ప్రతిష్టాత్మక ఫిఫా (FIFA) ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఈ సుందరి సందడి చేసింది. సాధారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే మైదానంలో జరిగే గోల్స్… ఆటగాళ్ల ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం సీన్ రివర్స్ అయింది. బ్లాక్ సూట్ ధరించి, ఎంతో క్లాసిక్ అండ్ స్టైలిష్ లుక్‌లో వచ్చిన ఈ యువతి అందరి దృష్టిని ఆకర్షించింది. కెమెరా కళ్లన్నీ ఆమె వైపే తిరగడంతో మ్యాచ్ చూస్తున్న వారంతా ఒక్కసారిగా ఫిదా అయిపోయారు.

మ్యాచ్ ముగిసిన వెంటనే ఈ మిస్టరీ బ్యూటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నల్లటి డ్రెస్‌లో ఆమె ఇచ్చిన పోజులు, కిల్లింగ్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మ్యాచ్‌ను కూడా మరిచిపోయేలా ఉంది ఆమె అందం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ రేంజ్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ‘బ్లాక్ బ్యూటీ’ అసలు ఎవరు? ఆమె పేరేంటి? ఏ దేశానికి చెందిన యువతి? అంటూ నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -