- Advertisement -

వోడాఫోన్ – ఐడియాతో కలవనున్న బీఎస్ఎన్ఎల్

- Advertisement -

భారత టెలికాం రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్, ప్రైవేట్ టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియాతో భాగస్వామ్యం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే లక్ష్యంతో ఈ చర్చలు ప్రారంభమైనట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ధృవీకరించింది.

ఈ భాగస్వామ్యం ద్వారా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ వనరులను పరస్పరం వినియోగించుకోవడం, ఆపరేషనల్ ఖర్చులను తగ్గించడం వంటి అంశాలు ప్రధానంగా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. టెలికాం రంగంలో పెరుగుతున్న పోటీ, పెట్టుబడుల అవసరం నేపథ్యంలో ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి.

ఈ ఒప్పందం కుదిరితే, రెండు సంస్థలకు కూడా ఆర్థికంగా ఊరట లభించడంతో పాటు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -